Skip to main content

Namaste NRI

ఎన్నారైలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమావేశం

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అమెరికాలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చికాగోలో ఉన్న ఎన్నారైలతో మంత్రి ఎర్రబెల్లి సమావేశమయ్యారు. అమెరికాలో ఉన్న తెలుగు వారు, వారి పరిస్థితులపై మంత్రి చర్చించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పరిపాలన విధానాన్ని  వారికి వివరించారు.  గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతున్నదన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ప్రజలు భాగస్వామ్యం పెరిగిందన్నారు.  మంత్రి వెంట ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డ, ఎన్నారైలు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News