Skip to main content

Namaste NRI

రష్యా  రాకెట్‌ దాడి

తూర్పు ఉక్రెయిన్‌లోని ఛాసివ్‌ యార్‌ పట్టణంలో ఓ అపార్ట్‌మెంట్‌పై రష్యా బలగాలు చేసిన రాకెట్‌ దాడిలో కనీసం 15 మంది దుర్మరణం చెందారు.  శిథిలాల్లో మరో 20 మంది చిక్కుకుపోయారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. జూన్‌లో క్రెమెన్‌చుక్‌లో ఒక షాపింగ్‌ మాల్‌పై జరిగిన దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ నెలలో దక్షిణ ఒడెసాలో అపార్ట్‌మెంట్‌పై దాడి ఘటనలో 21 మంది చనిపోయారు. సైనికపరమైన లక్ష్యాలపైనే గురి పెడుతున్నామని చెబుతున్న రష్యా ఈ తాజా ఘటనపై ఇంకా స్పందించాల్సి ఉంది. దాడులకు రష్యా విరామం పాటిస్తుందని భావిస్తున్న తరుణంలో తాజా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రష్యా అనుకూల వేర్పాటు వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్‌ ప్రాంతంలోని లుహాన్‌స్క్‌ ప్రావిన్సుపై పట్టు సాధించిన రష్యా బలగాలు మరో ఫ్రావిన్స్‌ డొనెటెస్క్‌లో పాగానే లక్ష్యంగా కదులుతున్నాయి.

Social Share Spread Message

Latest News