ఒకే ఒక్క పనితో రాత్రికి రాత్రే కోటీశ్వరడుయ్యాడు. కేరళకు చెందిన అనీష్ అర్జునన్ ఇండియాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగం కోసం యూఏఈ వెళ్లిపోయారు. అజ్మన్‌లోని ఓ సంస్థలో ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తూ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాజాగా అదృష్టం ఆయన తలుపు తట్టింది. ఆయ కొనుగోలు చేసిన లాటరీ టికెట్టుకు Mahzooz Draw లో జాక్ పాట్ తగలడంతో ఏకంగా 10 మిలియన్ దిర్హమ్‌లు (సుమారు రూ.21 కోట్లు) గెలుచుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుచుకున్న డబ్బులతో మొదట అప్పులు తీర్చేస్తా. నా ఫ్యామిలీని యూఏఈకి తీసుకొస్తా అని పేర్కొన్నారు.














