Skip to main content

Namaste NRI

2023 నాటికి ప్రపంచంలోనే… భారత్‌ నెం. 1

 ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా నిలిచింది. కానీ, ఆ రికార్డును భారత్‌ వచ్చే ఏడాది తిరగరాయ బోతున్నది. ఒక ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా భారత్‌ నిలవబోతున్నది. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌ జనాబా 141.2 కోట్లు, చైనా జనాభా 142.6 కోట్లు అని తెలిపారు. 2023లో చైనాను అధిగమిస్తుందని ఆ నివేదిక తెలిపింది. వచ్చే నవంబర్‌ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. దీంతో పాటు 2030లో దాదాపు 8.5 బిలియన్లుగా, 2050లో 9.7 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా తక్కువ సంఖ్యలో జనాభా పెరుగుతున్నట్లు నివేదికలో వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News