Skip to main content

Namaste NRI

సంచలన ఘటన… అమెరికాతో పాటు ఇతర  దేశాలకు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి సాద్‌ అల్‌ జాబ్రి షాకింగ్‌ ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరాయి సైనికులతో టైగర్‌ స్క్వాడ్‌ అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపారు. ఈ దశం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించారు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని అన్నారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువరాజు సల్మాన్‌ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని కుండబద్దలు కొట్టారు. యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి.

Social Share Spread Message

Latest News