ఉక్రెయిన్‌పై యుద్ధంలో వినియోగించడానికి వీలుగా వందల సంఖ్యలో సాయుధ డ్రోన్లను ఇరాన్ నుంచి తీసుకునేందుకు రష్యా సిద్ధమవుతోందని అమెరికా విశ్వసిస్తోంది. దీని కోసమే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే వారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లనున్నారని భావిస్తున్నారు. ఇరాన్ నుంచి తీసుకునే అధునాత మానవ రహిత డ్రోన్లు` ఆయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వందల మైళ్ల దూరం ప్రయాణించే లక్ష్యాలను చేధించిన రికార్డు వీటికి ఉంది. రాజధాని కీవ్‌ను ఆక్రమించడానికి వచ్చిన రష్యా బలగాలను డ్రోన్ల సాయంతోనే ఉక్రెయిన్ సైన్యం నిలువరించింది. అటు రష్యా, ఇటు ఇరాన్, రెండూ అమెరికాతో వైరాన్ని కలిగి ఉన్నాయి.
ఇరాన్ ఇప్పటికే డ్రోన్లను రష్యాకు అందజేసిందా అనే విషయంపై స్పష్టత లేదని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సులివన్ తెలిపారు. ఈ డ్రోన్లను ఎలా ఉపయోగించాలో రష్యా బలగాలకు ఇరాన్ ఈ నెలలో శిక్షణ ఇవ్వబోతోందని తెలిపారు. పుతిన్ వచ్చేవారం ఇరాన్‌కు వెళ్లి ఇరాన్, టర్కీ దేశాల నేతలతో త్రైమాసిక సమావేశంలో పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోన్ వెల్లడిరచారు. చర్చలు సిరియా అంశంపై జరుగుతాయని, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌తో కూడా పుతిన్ విడిగా సమావేశం కానున్నారని తెలిపారు. ఇరాన్, రష్యా సంబంధాలు ఉక్రెయిన్‌తో యుద్దం కంటే ముందు నుంచే బలంగా ఉన్నాయనీ, అధునాతన డ్రోన్ల సరఫరా కూడా ఇందులో భాగమేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.














