Namaste NRI

వర్చువల్‌గా భేటీ కానున్న జో బైడెన్‌,  ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర వర్చువల్‌గా భేటీ కానున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడిరచింది.  జో బైడెన్‌ ఈ వారం ఇజ్రాయెల్‌ను సందర్శించే సమయంలో నాలుగు దేశాల అధినేతలతో మొట్టమొదటిసారి వర్చువల్‌ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇజ్రాయెల్‌ ప్రధాని యాయిర్‌ లాపిడ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ అల్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌లతో బైడెన్‌ మాట్లాడతారు. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆహార, ఇంధన కొరతల గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తారు. పరస్సర సహకారం పెంపొందించడానికి కృషి చేస్తారు. ఇండియా, ఇజ్రాయెల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, యూఏఇలను కలిపి ఐ2యూ2గా వ్యవహరిస్తున్నారు. జులై 13 నుంచి 16 వరకు బైడెన్‌ పశ్చిమాసియా దేశాల్లో పర్యటిస్తారు. ఐ2యూ వర్చువల్‌ శిఖరాగ్ర సమావేశం జులై 14న జరుగుతుందని అమెరికా జాయతీ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events