Skip to main content

Namaste NRI

సౌరవ్‌ గంగూలీని సన్మానించిన బ్రిటీష్‌ పార్లమెంట్‌

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్‌ పార్లమెంట్‌ ఆయన్ను సన్మానించింది. బెంగాలీ అయినందుకు బ్రిటీష్‌ పార్లమెంట్‌ తనను సత్కరించినట్లు గంగూలీ తెలిపారు. పార్లమెంట్‌లో ఆ సత్కారం జరిగిందని, దీని గురించి ఆరు నెలల క్రితమే తనను కాంటాక్ట్‌ అయినట్టు తెలిపారు. ప్రతి ఏడాది ఈ అవార్డును ఇస్తుంటారని, తనకు ఈసారి దక్కినట్లు గంగూలీ తెలిపారు. 20 ఏళ్ల క్రితం జూలై 13వ తేదీనే గంగూలీని బ్రిటీషర్లు సన్మానించారు. 2002లో జరిగిన నాట్‌వెస్ట్‌ ఫైనల్లో గంగూలీ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఆ సందర్బంగా అప్పుడు సౌరవ్‌ గంగూలీని  సత్కరించారు.

Social Share Spread Message

Latest News