Skip to main content

Namaste NRI

రెండో రౌండ్‌ లో నూ రిషి సునాక్‌ ముందంజ

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రిటన్‌ ప్రధాని రేసులో రెండో రౌండ్‌ ముగిసింది.  మొత్తం ఐదు రౌండ్లలో సాగే ఎన్నికల్లో ఐదో రౌండ్లో ఎవరు అధిక్యతను ప్రదర్శిస్తారో వారే బ్రిటన్‌కు తదుపరి ప్రధానమంత్రి కానున్నారు. తాజాగా కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడికి జరుగుతున్న ఎన్నిక ప్రక్రియలో  రెండో రౌండ్‌ ఓటింగ్‌లో 101 మంది ఎంపీల మద్దతుతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్‌ రేసు నుంచి తప్పుకున్నారు. అతి తక్కువగా 27 మంది ఎంపీలే ఆమెకు మద్దతు తెలిపారు. దీంతో రేసులో అయిదుగురి మిగిలారు.

                 హాట్‌ఫెవరెట్గా భావిస్తున్న వాణిజ్య మంత్రి పెన్సీ మోర్డంట్‌ 83 మంది ఎంపీల ఓట్లతో రెండో స్థానంలోనూ, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ 64 ఎంపీల ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇద్దరు మిగిలేవరకు ఓటింగ్‌ ప్రక్రియ పలు రౌండ్లు కొనసాగుతుంది. సెప్టెంబర్‌ 5న చివరికి ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగే రహస్య ఓటింగ్‌లో నెగ్గేవారు ప్రధాని అవుతారు.

Social Share Spread Message

Latest News