రష్యా నుంచి ఎస్400 మిస్సైళ్లను కొనుగోలు చేసే విషయంలో అమెరికా నుంచి దాదాపు లైన్ క్లియర్ అయినట్లు స్పష్టమవుతోంది. భారత్‌పై విధించిన సీఏఏటీఎస్ఏ ఆంక్షలను ఎత్తివేయాలని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు ఆమోదం దక్కింది. ఈ సవరణ బిల్లును భారత సంతతి ప్రతినిధి రో ఖన్నా ప్రవేశపెట్టారు. దూకుడుమీదున్న చైనాను అడ్డుకోవాలంటే భారత్‌కు ఉపశమనం కలిగించే రీతిలో ఈ సవరణ అవసరమని ఆయన అన్నారు. అయితే మూజువాణి ఓటు ద్వారా ఈ సవరణకు ఆమోదం దక్కింది. రష్యా నుంచి రక్షణ సంబంధింత హార్డ్‌వేర్ కొనుగోలుపై ఆంక్షలు విధించిందే రీతిలో సీఏఏటీఎస్ఏ చట్టాన్ని ఆమెరికా రూపొందించుకున్నది. ఎస్400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రష్యాతో ఇండియా 5 బిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆ డీల్ కొనసాగితే, తమతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్లు అప్పట్లో అమెరికా హెచ్చరించింది. కానీ ఇండియా మాత్రం వెనక్కి తగ్గలేదు.














