చిత్ర నిర్మాణ రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్‌పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి ప్రొడక్షన్ హౌస్‌కు శ్రీకారం చుట్టింది. జ్యాపి యాప్ రూపకర్తలైన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రె పాటి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. జ్యాపి స్టూడియోస్ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించి నాలుగు సినిమాల్ని నిర్మిస్తున్నారు. జగమేమాయ, పతంగ్ తో పాటు, రాజ్‌తరుణ్, సుహాస్ కథానాయకులుగా సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జ్యాపి స్టూడియోస్ సంస్థ పోస్టర్ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఆయా సినిమాల పోస్టర్లని సినీ ప్రముఖులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనుదీప్.కె.వి, కొల్లి రామకృష్ణ ఆవిష్కరించారు. నిర్మాతల్లో ఒకరైన ఉదయ్ కోలా మాట్లాడుతూ సినీ నిర్మాణం ఒక సవాల్‌గా మారింది. ఈ పరిస్థితులన్నీ తర్వలోనే సరుÊ్దకుంటాయనే నమ్మకం ఉంది. ప్రేక్షకులకు కంటెంట్ అవసరం చాలానే ఉంది. ఆ నమ్మకంతోనే 2019లో జ్యాపి ఎంటర్టైన్మెంట్ పోర్టల్ డిజిటల్ వేదికని స్థాపించాం. పరిశ్రమపై అవగాహన పెంచుకుని నిర్మాణంలోకి అడుగుపెట్టాం. మంచి కథలతో ప్రేక్షకుల ముందుకొస్తొం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ తరుణ్, సుహాస్, కె.ఎల్.దామోదర ప్రసాద్, ధన్య బాలకృష్ణ, చైతన్య, ప్రణీత్, ప్రణవ్ కౌశిక్ వంశీ, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు పాల్గొన్నారు.














