ప్రభాస్ ఆదిపురుష్ శరవేగంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పనులు అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో జరుగుతున్నాయి. త్రీడి, ఐమాక్స్ హంగులతో సినిమా ముస్తాబవుతోందని దర్శకుడు ఓం రాత్ ట్విటర్ ద్వారా వెల్లడిరచారు. ఆదిపురుష్ పనులు పూర్తి దశకు వచ్చాయి. ప్రభాస్ అభిమానులకు నేనిచ్చే పెద్ద అప్ డేట్ ఇదే. సినిమా విడుదల కోసం నేనూ వేచి చూస్తున్నా అన్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రభాస్ రాఘవ్‌గా, సైఫ్ అలీఖాన్ లంకేశ్‌గా, కృతిసనన్ జానకిగా సందడి చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అనుకున్న సమయానికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న చిత్రం విడుదల కానుంది.














