Namaste NRI

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ

శ్రీలంకలో మరోసారి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తూ తాత్కాలిక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘె నిర్ణయం తీసుకున్నారు. జులై 17వ తేదీతో ఉన్న ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిరది. రాజుకీయ పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టి జాతీయ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మే 13న తాను ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని తెలిపారు. ప్రస్తుతం ఇంధన ధరలు దిగివస్తున్నాయని, విద్యుత్‌ సరఫరా మెరుగుపడిరదని పేర్కొన్నారు. గత వారం కూడా దేశంలో అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు విక్రమసింఘె తెలిపినా అధికారికంగా అమలులోకి రాలేదు. దేశాధ్యక్షుడి పార్లమెంటు సభ్యులు ఎన్నుకోనుండగా ఇంతలోనే ఆత్యయిక పరిస్థితి విధించడంపై విపక్షాలు మండిపడ్డాయి.

                మరోవైపు తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి విక్రమసింఘె దిగిపోవాలని డిమాండ్‌ చేస్తూ దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. అధ్యక్ష తరహా పాలనను రద్దు చేయాలని, వ్యవస్థను సమూలంగా మార్చివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. రాజపక్స కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ నుంచి ప్రజా ఉద్యమం  ప్రారంభమైన తర్వాత దేశంలో పలుమార్లు ఎమర్జెన్నీ విధించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events