Skip to main content

Namaste NRI

భారత సంతతి వ్యక్తికి ప్రతిష్ఠాత్మక అవార్డు 

భారతీయ సంతతికి చెందిన కౌశిక్‌ రాజశేఖర ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ఎనర్జీ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన విద్యుత్తు ఉత్పాదక ఉద్గారాలను తగ్గించేటపుడు విద్యుత్తు రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో అందించిన సేవలకుగాను ఆయనకు ఈ బహుమతి దక్కింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల నుంచి 119 నామినేషన్లు రాగా, ముగ్గురిని మాత్రమే గ్లోబల్‌ ఎనర్జీ అసోసియేషన్‌ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అక్టోబరు 12`14 తేదీల మధ్య మాస్కోలో జరిగే రష్యన్‌ ఎనర్జీ వారోత్సవాల్లో అవార్డులను అందజేస్తారు. దక్షిణ భారతదేశంలోని ఓ కుగ్రామం నుంచి రాజశేఖర ఈ స్థాయికి ఎదిగారు.

Social Share Spread Message

Latest News