Skip to main content

Namaste NRI

యూఏఈ వేదికగా  ఆసియా కప్‌

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు మరో షాక్‌ తగిలింది. లంకలో జరగాల్సిన ఆసియా కప్‌ మరో చోటుకు తరలిపోయింది. లంకలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో ఆసియా కప్‌ టోర్నమెంట్‌ నిర్వహించలేమని, ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ఆసియా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) రంగంలోకి దిగి, సభ్య దేశాలతో సంప్రదింపులు జరిపింది. యూఏఈ వేదికగా టోర్నీ నిర్వహణకు మొగ్గుచూపాయి. ఆసియా కప్‌ టోర్నమెంట్‌ను యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఈ కూడా ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీమెంట్‌ జరుగనుంది. ఈసారి ఆసియా కప్‌ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్య (ఐసీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News