Skip to main content

Namaste NRI

చైనా- భారత్‌ మధ్య పోరు..  రష్యా నుంచి

ఆర్థిక ఆంక్షలంతో సతమతమవుతున్న రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్‌ చురుకుగా వ్యవహరిస్తోంది. తమకు అవసరమైన ముడి చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. అయితే భారత్‌ దూకుడు చైనాకు తలనొప్పిగా తయారైంది. రష్యా నుంచి చైనా కొనుగోలు చేయడానికి  ఇష్టపడే గ్రేడ్‌ (రకం) ముడి చమురునే భారత్‌ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండటం విశేషం. రష్యా నుంచి ఎక్కువగా ఐరోపా దేశాలు ప్రత్యేకంగా రగం ముడి చమురును కొనుగోలు చేస్తాయి. ఆ ముడి చమురును  శుద్ధి చేయాలంటే ప్రత్యేక యంత్ర సామాగ్రి, పెద్దఎత్తున ఆధునిక సాంకేతికత అవసరం. అలాగే,  చైనా కొనుగోలు చేసే ముడి చమురు శుద్ధి చేయాలన్నా ప్రయాసే. ఆ ఏర్పాట్లునుందుకే ఆయా దేశాలు రష్యా నుంచి తమకు నచ్చిన గ్రేడ్‌ల ముడి చమురును కొనుగోలు చేసేవి. ఈ నేపథ్యంలో సాధారణ రకం ముడి చమురును కొనుగోలు చేసే భారత్‌ ఇప్పుడు చైనా కొనే గ్రేడ్‌ (ఈఎస్‌పీఓ)చమురునే అడుగుతోంది. రష్యాలోనూ తూర్పు భాగాన్న ఉన్న రిఫైరీల నుంచి పెద్ద ఎత్తున క్రూడ్‌ ఆయిలన్‌ను కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో ఆంక్షలు విధించడం వల్ల వాటిని నిర్వీర్యం చేసేలా భారత్‌ వ్యవహరించకూడదని సాక్షాతు అమెరికా చెప్పింది. అయినా  దేశ ప్రయోజనాల రీత్యా ముడి చమురు కొనుగోళ్లు ఆపేది లేదని, అయినా ఐరోపా దేశాలు దిగుమతి చేసుకునే మొత్తంలో పోలిస్తే భారత్‌ చాలా స్వల్పస్థాయిలోనే దిగుమతి చేసుకుంటోంది అని కుండలు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News