Skip to main content

Namaste NRI

భారత్‌ పై అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం నిత్యం పెరుగుతూ వెళ్తున్నది. సవాల్‌ విసురుతోతన్న ద్రవ్యోబల్బణంపై దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో మాంద్యంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంలో మాంద్యం రాబోదన్నారు. నా దృష్టిలో మే ప్రస్తుతం మాంద్యంలోకి వెళ్లడం లేదు. అమెరికాలో నిరుద్యోగ రేటు ఇప్పటికీ చరిత్రలో అత్యల్పంగా ఉంది. ఇది కేవలం 3.6 శాతంలోనే ఉన్నది. ఈ  సందర్భంగా భారత్‌పై బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ మినహా చాలా పెద్ద దేశాలు మాంద్యం బారినపడుతుయన్నారు. ఇప్పటికే ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న చాలా ఆసియా దేశాలు మాంద్యం బారినపడే ప్రమాదం ఉందని ఇటీవల బ్లూమ్‌బర్గ్‌ నిర్వహించిన సర్వేలో తెలింది.

Social Share Spread Message

Latest News