Skip to main content

Namaste NRI

అదృష్టం అంటే ఇదే… ఇల్లు అమ్మకానికి పెట్టగా

కేరళలోని కోజికోడ్‌లోని మంజేశ్వర్‌కు చెందిన మహ్మద్‌ బవ(50) జాక్‌పాట్‌ తగిలింది.  అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి దిక్కుతోచని స్థితిలో ఉండగా అదృష్టం లాటరీ రూపంలో వచ్చి కాపాడిరది. తన సొంతింటిని మరికొద్ది గంటల్లో విక్రయించే సమయంలో ఏకంగా రూ.కోటి జాక్‌ పాట్‌ తగిలింది.  ఇతడికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. సుమారు 8 నెలల క్రితం 2వేల అడుగుల విస్తీర్ణంలో ఇంటిని ఎంతో ఇష్టంగా కట్టుకున్నాడు. అయితే, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేయడంతో పాటు కొడుకును ఖతార్‌ పంపేందుకు చేసిన రూ.50 లక్షల అప్పులు మిగిలాయి. దీంతో కట్టుకున్న ఇంటిని రూ. లక్షలకు అమ్మేందుకు సిద్దపడ్డాడు. అయితే ఇతడికి లాటరీ టికెట్లు కొనే అలవాటుంది.  ఒకేసారి నాలుగు టికెట్లు కొన్నాడు. నిర్వాహకులు డ్రా తీయగా మహ్మద్‌కు జాక్‌పాట్‌ తగిలింది.  కొద్ది గంటల్లో అడ్వాన్స్‌ కూడా తీసుకోవాల్సిన ఉన్న సమయంలో ఇది జరిగింది. దీంతో మహ్మద్‌ అనందానికి అవధుల్లేకుండా పోయింది. లాటరీ మొత్తంలో పన్నులు పోగా చేతికి రూ.63 లక్షలు అందనుంది.

Social Share Spread Message

Latest News