Skip to main content

Namaste NRI

ప్రపంచంలోనే అరుదైన వజ్రం.. 300 ఏళ్లలో ఇలాంటిది చూడలేదు

ఇది అరుదైన గులాబీ రంగు వజ్రం. 170 క్యారెట్ల ఈ పింక్‌ డైమండ్‌. ప్రపంచవ్యాప్తంగా 300 సంవత్సరాలలో వెలికి తీసిన అతిపెద్ద వజ్రం. అంగోలాలోని లూలో గనిలో జరిపిన తవ్వకాలలో దొరికిన ఈ డైమండ్‌ను లూలోరోజ్‌ గా పిలుస్తున్నారు. సహజమైన వజ్రాల్లో అత్యంత స్వచ్ఛతో, పూర్తిగా ఒకే రంగుతో ఉన్న అత్యంత అరుదు అని, ఈ పింక్‌ డైమండ్‌ అరుదైన ఆ కేటగిరిలోకి వస్తుందని లుపాకా కంపనీ ప్రకటించింది. ఈ వజ్రానికి లులో రోజ్‌ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ముడి రూపంలో ఈ వజ్రాన్ని సానబెడితే 85 నుంచి 90 క్యారెట్ల వరకు ఉండే ఒక పెద్ద పాలిష్డ్‌ వజ్రం. మరిన్ని చిన్న వజ్రాలు రూపొందుతాయని లుకాపా డైమండ్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీనిని త్వరలో వేలం వేయనున్నట్లు వారు తెలిపారు. అయితే ధర ఎంత వస్తుందనేది ఇంకా అంచనా వేయలేదు.  సహజంగా దొరికే గులాబీ రంగు వజ్రాలకు డిమాండ్‌ ఎక్కువ. 2017లో జరిగిన హాంకాంగ్‌ వేలంలో 59.6 క్యారెట్ల ఓ పింక్‌ డైమండ్‌ రూ.596 కోట్ల ధర పలికింది.

Social Share Spread Message

Latest News