Namaste NRI

ఎమర్జెన్సీ నుంచి అటల్‌ బిహారి వాజ్‌పేయి లుక్‌

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ. భారత రాజకీయ చరిత్రలో ఓ ప్రధాన ఘట్టమైన ఎమర్జెన్సీ రోజుల నాటి ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషిస్తుండగా, జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌  నటిస్తున్న సంగతి తెలిసిందే. భూమికా చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది.  ఈ కథలో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రకూ ఎంతో ప్రాధాన్యముంది. ఇప్పుడా పాత్రను నటుడు, దర్శకుడు శ్రేయస్‌ తప్పలడే పోషిస్తారని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రేయస్‌ మాట్లాడుతూ భారతదేశం లోనే కాదు ప్రపచంలోనే అత్యంత ప్రియమైన నాయకుల్లో వాజ్‌పేయీ ఒకరు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించాన్ని గౌరవంగా, పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. నేను అందరి అంచనాలను అందుకుంటానని ఆశిస్తున్నా అన్నారు. కంగనా హోం బ్యానర్‌ మణి కర్ణిక ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రేణు పిట్టి, కంగనారనౌత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, రితేశ్‌ షా. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events