భారత్ లో అత్యంత సంపన్నురాలిగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్ పర్సన్ రోష్ని నాడార్ నిలిచారు. రోష్ని నాడార్ ఇండియాలో అత్యంత ధనిక మహిళగా నిలిచినట్లు కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హరూన్ జాబితా తేల్చింది. ఆమె 2021 చివరి నాటికి ఏకంగా రూ.84,300 కోట్ల సంపదతో టాప్‌లో నిలిచారు. అంతకు ముందుట ఏడాదితో పోలిస్తే ఆమె సంపద 54 శాతం పెరిగిందని తెలిపింది. 40 ఏళ్ల వయసులోనే రోష్ని నాడార్ ఈ స్థాయికి చేరడం గమనార్హం.
ఇక దేశంలో రెండో అత్యంత ధనికురాలు నైకా బ్యూటీ బ్రాండ్ వ్యస్థాపకురాలు ఫల్గుణి నాయర్ నిలిచింది. ఆమె సంపద రూ.57,520 కోట్లు అని ఏడాదిలో సంపద 963 శాతం పెరిగిందని హరూన్ సంస్థ తెలిపింది. దేశంలో మూడో అత్యంత ధనికురాలుగా బయోకాన్ సంస్థకు చెందిన కిరణ్ మంజుందార్ షా నిలిచారు. ఆమె సంపద రూ.29,030 కోట్లు అని, అయితే ఆమె సంపద 21 శాతం తగ్గిపోయిందని హరూన్ సంస్థ తెలిపింది.














