అమెరికా వైఖరిపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతోందని అన్నారు. తైవాన్ విషయంలో కొందరు అమెరికా రాజకీయవేత్తలు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. అమెరికా వైఖరిని ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. పెలోసీ పర్యటన ప్రభావం చైనా`అమెరికా సంబంధాలపై కచ్చితంగా ఉంటుందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. పెలోసీ పర్యటన కంటే ముందు హ్యాకర్లు తైవాన్ అధ్యక్షుడి కార్యాలయం వెబ్‌సైట్‌పై సైబర్ దాడికి దిగారు.














