ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అల్‌జవహరిని అమెరికా బలగాలు హతమార్చాయి. ఈ క్రమంలో అమెరికా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది. అల్ జవహరి మరణం నేపథ్యంలో అల్‌ఖైదా మద్దతుదారులు అమెరికా కార్యాలయాలు, అధికారులు, పౌరులపై దాడులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. విదేశాలకు ప్రయాణాలు చేసే సమయంలో పరిస్థితులను గమనిస్తూ ఉండండి అని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.














