Skip to main content

Namaste NRI

కార్తికేయ 2 ట్రైలర్‌కు అనూహ్య స్పందన

నిఖిల్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2 చిత్రంపై  అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. అద్బుతమైన విజువల్స్‌, అదిరిపోయే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. దర్శకుడు చందూ ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్‌ ఫీస్టుగా తెరకెక్కిస్తున్నాడని ట్రైలర్‌ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ నిఖిల్‌ కి జంటగా నటిస్తుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాని క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News