వరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం పూర్ణ. సోనాక్షి వర్మ, చైతన్య ప్రియ కథానాయికలు. యమ్‌ఆర్డీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ఎంఆర్ దీపక్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. లవ్‌స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్లపై తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత దీపక్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటి నుంచి అమ్మాయిలు తమకి తాము ఎలా కాపాడుకోవాలనేది ఈ చిత్ర కథాంశమన్నారు. చక్కటి లవ్‌స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుందని తెలిపారు. హీరో వరుణ్ మాట్లాడుతూ భయమంటే తెలియని ఓ అబ్బాయి అనుక్షనం భయపడే ఒక అమ్మాయికి ఎలాంటి ధైర్యం ఇచ్చాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది అన్నారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యే కథ ఇది అన్నారు సోనాక్షి వర్మ. నటులు విజయ్ భాస్కర్, ఆజాద్, కెమెరామెన్ కొల్లి ప్రసాద్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం : రాజ్ కిరణ్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మోహన్ వడ్లపట్ల, అనుపమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.














