Namaste NRI

మిస్‌ ఇండియా యూఎస్‌ఏగా ఆర్య వాల్వేకర్‌

అమెరికాలోని న్యూజెర్సీలో అందాల పోటీల్లో జరిగాయి. భారతీయ అమెరికన్‌ టీనేజర్‌ ఆర్య వాల్వేకర్‌ మిస్‌ ఇండియా యూఎస్‌ఏ`2022 కిరీటాన్ని దక్కించుకున్నారు. 18 ఏండ్ల ఈ యువతిది వర్జీనియా రాష్ట్రం. న్యూజెర్సీలో నిర్వహించిన ఈ పోటీల్లో యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియాలో ప్రీ మెడికల్‌ సెకండియర్‌ విద్యార్థిని సౌమ్యశర్మ ఫస్ట్‌ రన్నరప్‌గా, న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందిన ఆక్షి జైన్‌ మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని, న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్‌ మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ వెండితెరపై తనను తాను చూసుకోవాలని, సినిమాలు, టీవీల్లో పనిచేయాలనేది తన చిన్ననాటి కల అన్నారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం, వంట చేయడం, చర్చల్లో పాల్గొనడం తనకు అలవాటన్నారు. అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది అభ్యర్థులు మూడు వేర్వేరు విభాగాల్లో పోటీ పడ్డారు. మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని వాషింగ్టన్‌కు చెందిన అక్షి జైన్‌, మిస్‌ టీన్‌ యూఎస్‌ఏ కిరీటాన్ని న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్‌ సొంతం చేసుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events