భారత పర్యటకులకు నేపాల్ షాక్ ఇచ్చింది. కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో నేపాల్ అప్రమత్తమైంది. భారతీయ పర్యాటకులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నేపాల్ నిషేధం విధించింది. ఇటీవల భారత్ నుంచి బైతడి జిల్లాకు వచ్చిన నలుగురు భారతీయ పర్యాటకులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణయిందని అధికారులు తెలిపారు. వారిని వెంటనే తిరిగి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించామన్నారు. భారత్ నుంచి తిరిగి వచ్చే నేపాలీయుల కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నందున పర్యాటకులపై నిషేధం విధించామన్నారు. ఒక్క రోజే నేపాల్‌లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.














