కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ను ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ఘవలియో డి లా లిజియన్ హానర్ వరించింది. థరూర్ రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ప్రకటించినట్లు భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనియన్ తెలిపారు. తనకు పురస్కారం దక్కడంపై థరూర్ హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌తో సంబంధాలను సమర్థించే, భాషను ప్రేమించే, సంస్కృతిని ఆరాదించే వ్యక్తిగా ఈ అవార్డు పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నన్ను దీనికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు. శశిథరూర్ గతంలో ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. గతంలో ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేశారు.














