ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలవడం కంటే ఓటమే నయమని రిషి సునాక్ అన్నారు. బ్రిటన్ ఆర్థిక సమస్యలపై పరిష్కారాలపై స్పందిస్తూ రిషి ఈ కామెంట్స్ చేశారు. బ్రిటన్ ప్రధాని పదవికి సునాక్, లిజ్ ట్రస్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. తాను గెలిస్తే పన్నులను తగ్గిస్తానని ట్రస్ హామీ ఇవ్వగా, దానివల్ల ధనవంతులకే ప్రయోజనమని సునాక్ తిప్పికొట్టారు. ప్రజల నుంచి డబ్బు తీసుకోవడం తన ప్రాధాన్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం, ప్రధానంగా విద్యుత్ బిల్లుల గురించి లక్షల మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారని, తాను ప్రధానిగా ఎన్నికైతే వారిని ఆదుకోవడంలో ముందుంటానని పేర్కొన్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లో ప్రజలకు సహకరించాలని నిర్ణయించుకున్నాను. ప్రజలు డబ్బుల తీసుకోకుండా ఉండేందుకే నేను ప్రాధాన్యమిస్తాను. ప్రధానమంత్రిగా ఎన్నికైతే ఇప్పటికే చెప్పినవాటికంటే మెరుగైన నిర్ణయాలు తీసుకుంటాను అని హామీ ఇచ్చారు.














