Skip to main content

Namaste NRI

కెనడాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కెనడాలో భారత్‌ రాయబార కార్యాలయంలో జరిగే స్వాంత్రత్య దినోత్సవ వేడుకలకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని కెనడా ప్రభుత్వాన్ని భారత్‌ కోరింది. కెనడాలోని భారతీయులు జరుపుకునే వేడుకలకు  భద్రత కల్పించాలని కేంద్రం కోరడం ఇదే ప్రథమం. గతంలో అదనపు  భద్రతా కల్పించాలని మాత్రమే కోరిన ప్రభుత్వం ఈ మారు దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా భద్రత కల్పించాలని కోరింది. పాకిస్థాన్‌, ఖలిస్థాన్‌ అనుకులా వర్గాలు ఈ వేడుకల్లో ఆటంకాలు సృష్టించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు భారత్‌ వర్గాలు తెలిపాయి.  ఈ ఏడాది స్వాంత్రంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పనోరమా ఇండియా టొరొంటోలో ఇండియా పరేడ్‌ నిర్వహించనుంది. ఓ బారీ బహిరంగ సభతో ఈ వేడుకలు ముగుస్తాయి.  ఇక బ్రిటన్‌ కొలంబియా రాష్ట్రంలో ఈ మారు భారతీయు కార్‌ ర్యాలీ నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

Social Share Spread Message

Latest News