రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనేది ఉప శీర్షిక. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలోని జింతాక్ అనే పుల్ మాస్ సాంగ్ ఉంది. ఈ పాట లిరికల్ వీడియోను ఈ నెల 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. హీరో హీరోయిన్లు రవితేజ, శ్రీలీల పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సహా నిర్మాత : వివేక్ కూచిభోట్ల.














