Namaste NRI

రవితేజ ధమాకా జింతాక్‌  రిలీజ్‌ అప్పుడే

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో  రూపొందుతున్న చిత్రం ధమాకా. డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉప శీర్షిక. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్‌ మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలోని జింతాక్‌ అనే పుల్‌ మాస్‌ సాంగ్‌ ఉంది. ఈ పాట లిరికల్‌ వీడియోను ఈ నెల  18న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. హీరో హీరోయిన్లు రవితేజ, శ్రీలీల పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్‌ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో,  కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, సహా నిర్మాత : వివేక్‌ కూచిభోట్ల.

Social Share Spread Message

Latest News