భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంక ప్రభుత్వం చైనాకు అనుమతి ఇచ్చింది. దీంతో చైనా నిఘా నౌక యువాన్ వాంగ్`5 హంబన్‌తోట పోర్ట్‌కు చేరింది. చైనా తమ సైనిక కార్యకలాపాలు, గూఢచార్యానికి ఈ పోర్ట్‌ను వినియోగించుకోవచ్చని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలో సాంకేతికంగా అత్యాధునిక నిఘా నౌక డాకింగ్‌పై అభ్యంతరం తెలిపింది. 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11,944 కోట్లు) విలువ గల హంబన్‌తోట నౌకాశ్రయం ఆసియా, యూరప్ మధ్య ప్రధాన నౌకా మార్గానికి సమీపంలో ఉంది. శ్రీలంక అప్పు చెల్లించలేక హంబన్‌తోట ఓడరేవును 99 ఏళ్లకు తనఖా పెట్టినప్పటి నుంచి భారత్ ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తోంది. చైనా నౌక ఆగస్టు వారం రోజుల పాటు హంబన్‌తోట ఓడరేవులో ఆగనున్నట్లు తెలుస్తున్నది.














