Skip to main content

Namaste NRI

సంగీత పనుల్లో శాసనసభ

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా వేణు మడికంటి తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం శాసనసభ, తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, సోనియా అగర్వాల్‌, పృథ్వీరాజ్‌ ముఖయ పాత్రల్లో నటిస్తున్నారు. కీలక పాత్రలు పోఫిస్తున్నారు. ఈ సినిమాకి రవి బసూర్‌ స్వరాలందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర నేపథ్య సంగీతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర నిర్మాణ షణ్ముగం మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ చిత్రమిది. అందరికి నచ్చే కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాకి రవి బసూర్‌ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఈ సినిమా తప్పకుండా మా బ్యానర్‌ ప్రతిష్ఠను పెంచే విధంగా ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు.

Social Share Spread Message

Latest News