శ్రీకర్, అపూర్వ జంటగా హరికృష్ణ జినుకుల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం హౌస్ హజ్జెండ్. భానుచందర్, సుమన్, గిరిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. చిత్ర దర్శక నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ ఇదొక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. కొవిడ్ టైమ్‌లో కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో ఓ షెడ్యూల్ పూర్తి చేశాం అన్నారు. హీరో శ్రీకర్ మాట్లాడుతూ ఇంటిపట్టునే ఉండే భర్త కావాలనుకున్న ఓ అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నది చిత్ర కథాంశం అన్నారు. త్వరలో షూటింగ్ పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ చిత్రంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా నటిస్తున్నాను అన్నారు అపూర్వ. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాత రామసత్యనారాయణ, వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.














