Skip to main content

Namaste NRI

హౌస్ హజ్జెండ్ టీజర్ లాంచ్

శ్రీకర్‌, అపూర్వ  జంటగా హరికృష్ణ జినుకుల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం హౌస్‌ హజ్జెండ్‌.  భానుచందర్‌, సుమన్‌, గిరిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ను  విడుదల చేశారు. చిత్ర దర్శక నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ ఇదొక సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. కొవిడ్‌ టైమ్‌లో కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశాం అన్నారు. హీరో శ్రీకర్‌ మాట్లాడుతూ ఇంటిపట్టునే ఉండే భర్త కావాలనుకున్న ఓ అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నది చిత్ర కథాంశం అన్నారు. త్వరలో షూటింగ్‌ పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ  చిత్రంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా  నటిస్తున్నాను అన్నారు అపూర్వ. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌, నిర్మాత రామసత్యనారాయణ, వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News