Skip to main content

Namaste NRI

హిందూ సంప్రదాయం ప్రకారం అమెరికా యువతి పెళ్లి!

అమెరికా కు చెందిన రోజర్స్  లాస్ ఏంజిల్స్‌లో ఇమ్మిగ్రేషన్ అటార్నీగా పని చేస్తోంది. అగ్రరాజ్యానికి చెందిన యువతి అయినప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి  చేసుకుంది. విధుర్ గోయల్ అనే యువకుడిని నవంబర్ 18న జైపూర్‌లోని జై మహల్ ప్యాలేస్ ఆమె వివాహమాడింది. పెళ్లి సందర్భంగా రోజర్స్ ఎరుపు రంగు లెహంగా ధరించి హిందూ సంప్రదాయం ప్రకారం ముస్తాబైంది. ఆమెతోపాటు రోజర్స్ తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఇలా అందరూ హిందూ సంప్రదాయం ప్రకారమే రెడీ అయి పెళ్లికి హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News