Namaste NRI

వీరసింహారెడ్డి నుంచి సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. శృతిహాసన్‌, దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, చంద్రిక రవి తదితరులు నటిస్తు న్నారు.  ఈ సినిమాలోని సుగుణ సుందరి లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. థమన్‌ స్వరపరచిన ఈ పాటను రామ్‌ మిరియాల, స్నిగ్ధ ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందించారు. ఇస్తాంబుల్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాట హుషారెత్తించే మాస్‌ బీట్‌తో ఆకట్టుకుంటున్నది. సుగుణా సుందరి..సుర సుర చూపుల రాకుమారి..పెళ్లిగంట కొట్టినాదే అత్తింటికి రా మరి అనే లైన్స్‌ మాస్‌ను మెప్పించేలా ఉన్నాయి. పవర్‌ఫుల్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌ కలబోసిన చిత్రమిదని, బాలకృష్ణ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సంగీతం: తమన్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, సీఈఓ: చెర్రీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.

Social Share Spread Message

Latest News