Skip to main content

Namaste NRI

జెఫ్‌ బెజోస్‌ మరోసారి ఉదారణ…మూడేళ్లలో

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మాజీ బార్య మెకంజీ స్కాట్‌ తన ఉదారతను మరోసారి చాటుకుంది. నవలా రచయిత అయిన ఆమె తన సంపదతో సగానికి పైగా విరాళం ఇస్తానని గతంలో ప్రకటించింది.  మూడేళ్లలో 14 వందల కోట్ల డాలర్లును విరాళంగా ఇచ్చింది. మెకంజీ నుంచి డొనేషన్‌ అందుకున్న సంస్థల్లో 16 వేల ఎన్జీవోలు ఉన్నాయి. ఈ విషయాన్ని  ఈల్డ్‌ గివింగ్‌ అనే వెబ్‌సైట్‌ వెల్లడిరచింది. ఇందులో స్కాట్‌  ఏ సంస్థకు ఎంత విరాళం ఇచ్చింది అనే వివరాలు అన్నీ పొందుపరిచారు. ఇతరులు డొనేషన్స్‌ ఇచ్చేవాళ్లు, నా టీమ్‌ ఇచ్చే సమాచారం విరాళం ఇవ్వడంలో నాకు చాలా సహాయపడుతోంది అని స్కాట్‌ తెలిపింది.  అంతేకాదు డొనేషన్స్‌ కావాలనుకునే సంస్థలు తమ వివరాలు పంపించాలని మెకంజీ తెలిపింది. ఇప్పటి వరకు మెకంజీ, ఆమె టీమ్‌ వివరాలు ఇచ్చే ముందు ఆయా సంస్థల గురించి రహస్యంగా ఆరా తీస్తున్నారు. 

Social Share Spread Message

Latest News