Namaste NRI

టాప్‌ గేర్‌ ట్రైలర్‌ విడుదల చేసిన రవితేజ

ఆది సాయికుమార్‌, రియా సుమన్‌ జంటగా నటిస్తున్న చిత్రం టాప్‌ గేర్‌. ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్‌ రెడ్డి నిర్మించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు కె.శశికాంత్‌ రూపొందించారు. సత్యం రాజేష్‌, మైమ్‌ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను హీరో రవితేజ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు. కె.శశికాంత్‌ మాట్లాడుతూ మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన రవితేజకు థాంక్స్‌. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథ అయినా ఇందులో లవ్‌, రొమాన్స్‌ వంటి అంశాలుంటాయి. కథలో వచ్చే మలుపులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇందులో ఆది టాక్సీ డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తారు. సంగీతం, సినిటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్‌, మైమ్‌ గోపి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events