Namaste NRI

ఈ సినిమా చూశాక మీరు తప్పకుండా ప్రేమలో

 నిఖిల్‌ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 18 పేజీస్‌. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరో నిఖిల్‌ మాట్లాడుతూ 18 పేజీస్‌ సినిమా బాగా వచ్చింది. ఫీల్‌గుడ్‌ లవ్‌సోర్టీగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూశాక మీరు తప్పకుండా ప్రేమలో పడతారు అని అన్నారు.  విభిన్న ప్రేమకథా చిత్రంగా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని అల్లు అరవింద్‌  పేర్కొన్నారు.  నేటి యువత ట్రెండ్‌కు తగినట్లుగా ఈ సినిమాను తెరకెక్కించామని బన్నీ వాసు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ  అరవింద్‌ గారు ఈ సినిమా విషయంలో  ఎంతో ప్రోత్సాహాన్నందించారు. హృదయానికి హత్తుకునే ప్రేమకథగా మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events