Namaste NRI

 30న  టాప్‌ గేర్‌  రిలీజ్‌ 

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టాప్‌గేర్‌. శశికాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 30న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.  సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి.  పేరుకు తగ్గట్టే ఆది సాయికుమార్‌ సినీ ప్రయాణానికి మరింత ఊపు వేగాన్నిచ్చే చిత్రమిది.  ఆయనొక టాక్సీ డ్రైవర్‌ పాత్రలో చేసిన సందడి ఆకట్టుకుంటుంది. బిగితో కూడిన ఓ మంచి థ్రిల్లర్‌గా ప్రతీ సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. సెన్సార్‌ బృందం మెప్పు కూడా పొందిన ఈ చిత్రం తప్పక ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతుందని సినీ వర్గాలు తెలిపాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events