Skip to main content

Namaste NRI

ఈ సినిమా కూడా సక్సెస్‌ కావాలి … సుమన్‌

కిరణ్‌ రాజ్‌, ప్రియా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా నువ్వే నా ప్రాణం.   తాజాగా జరిగిన చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో సుమన్‌ మాట్లాడుతూ భానుచందర్‌, నేను సోదరుల్లాం ఉంటాం. మేం కలిసి నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా సక్సెస్‌ కావాలి’ అన్నారు.   దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి మాట్లాడుతూ ఒక కమర్షియల్‌ ప్రేమ కథా చిత్రమిది. 2019లోనే దీన్ని ప్రారంభించినా లాక్‌డౌన్‌ వల్ల సినిమా రిలీజ్‌ ఆలస్యమైంది. ఫైట్స్‌, సాంగ్స్‌ ఆకర్షణగా నిలుస్తాయి. ఎంతో అనుభవం గల సుమన్‌, భానుచందర్‌ వంటి నటులు మా సినిమాలో కీలక పాత్రలు పోషించడం సంతోషంగా ఉంది’ అన్నారు.  ఈ చిత్రాన్ని వరుణ్‌ కృష్ణ ఫిలింస్‌ బ్యానర్‌పై శేషుదేవరావ్‌ మలిశెట్టి నిర్మిస్తున్నారు. శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకుడు. సుమన్‌ భానుచందర్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ నెల 30న ఈ సినిమా విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News