Skip to main content

Namaste NRI

అన్‌ స్టాపబుల్‌  టీజర్‌ను చేసిన విడుదల అక్కినేని నాగార్జున

వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్‌ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం అన్‌ స్టాపబుల్‌. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. కథ, కథనాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇటీవల విడుదల చేసిన మోషన్‌పోస్టర్‌తో పాటు టీజర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. బిత్తిరి సత్తి, షకలక శంకర్‌, పృథ్వీ, డీజే టిల్లు మురళి తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రాని డైమండ్‌ రత్నబాబు దర్శకుడు. రజిత్‌రావు నిర్మాత.  సంగీతం: భీమ్స్‌ సిసిరోలియా.

Social Share Spread Message

Latest News