Skip to main content

Namaste NRI

బే ఏరియాలో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

 అమెరికాలోని కాలిఫోర్నియాలో బే ఏరియా నందు వైఎస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా ప్లీసాటన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, ఎన్‌ఆర్‌ఐలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి వైఎస్‌ జగన్‌కు   జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  జగన్‌ మోహన్‌ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజల అశీసులతో 2024లో మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి, పేద, బడుగు బలహీన వర్గాలకు మరింత సేవ చేయాలని ఆకాక్షించారు.

ఈ కార్యక్రమంలో  వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ చంద్రహాస్‌ పెద్దమళ్లు, గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబెర్‌ కేవీ రెడ్డి, బే ఏరియా వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్య సభ్యులు అబ్బవరం సురేంద్ర, ప్రవీణ్‌ మునుకూరు, శివారెడ్డి, కొండారెడ్డి, కిరణ్‌ కూచిబొట్ల, ప్రశాంతి, సుగుణ, సురేష్‌ తనమల, తీరు, ఎస్‌పీ, వంశీకృష్ణ  రెడ్డి, నరేంద్ర కొత్తకోట, వైఎస్‌ఆర్‌సీపీ స్టూడెంట్‌ విభాగం నేతలు, వైఎస్‌ఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News