అమెరికాలో అంతర్యుద్ధం తప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ జోస్యం చెప్పారు. అంతర్యుద్ధ పరిణామాల్లో యూఎస్ నుంచి కాలిఫోర్నియా విడిపోక తప్పదని, అనంతరం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కావటం ఖాయమని మెద్వెదేవ్ తెలిపారు. 2023లో కొన్ని సంఘటనలు జరుగుతాయంటూ పలు అంచనాలను ఆయన వెల్లడించారు.














