Namaste NRI

చైనాలో భీక‌ర ప్ర‌మాదం … ఈ ఘ‌ట‌న‌లో సుమారు 

చైనాలోని సెంట్ర‌ల్ ప్రావిన్సు న‌గ‌రం జెంగ్జూలో ఉన్న ఓ హైవేపై భీక‌ర ప్ర‌మాదం జ‌రిగింది. తెల్ల‌వారుజామున కమ్ముకున్న ద‌ట్ట‌మైన పొగ మంచులో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఆ రోడ్డుపై వాహ‌నాలు ఒక‌దాన్ని ఒక‌టి ఢీకొన్నాయి. ఆ ఘ‌ట‌న‌లో సుమారు 200 కార్లు ధ్వంసం అయ్యాయి.  ఓ బ్రిడ్జ్‌పై వాహ‌నాల‌న్నీ కుప్ప‌లు కుప్పలుగా నుజ్జునుజ్జు అయ్యాయి. యెల్లో రివ‌ర్‌పై ఉన్న బ్రిడ్జ్ మీద ప్ర‌మాదం జ‌రిగింది. అతి పొడుగైన మ‌ల్టీలేన్ బ్రిడ్జ్ భ‌యాన‌కంగా త‌యారైంది. కార్లు, కార్గో ట్ర‌క్కులు, లారీలు, ఇత‌ర వాహ‌నాలు ఒక‌దాన్ని ఒకటి ఢీకొన్నాయి.  డ్రైవ‌ర్లు, ప్యాసింజెర్లు త‌మ కార్ల‌లోనే చిక్కుకుపోయారు. అనేక కీలోమీట‌ర్ల దూరం మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. ఇక రోడ్డు మీద ఉన్న మంచు త‌డి వ‌ల్ల వాహ‌నాలు జారిపోయి ఢీకొన్న‌ట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events