Skip to main content

Namaste NRI

బుట్ట బొమ్మ నుంచి పేరు లేని ఊరులోకి   

అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా బుట్ట బొమ్మ. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకుడు. ఈ చిత్రం నుంచి పేరు లేని ఊరులోకి   అనే పాటను విడుదల చేశారు. సనాపతి భరద్వాజ్‌ పాత్రుడు సాహిత్యాన్ని అందించిన ఈ పాటను స్వీకర్‌ అగస్తి స్వరపర్చగా, మోహన భోగరాజు పాడారు. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కునే సత్య అనే అందమైన అమ్మాయి ప్రేమ కథ ఇది. ఆహ్లాదకర గ్రామీణ వాతావరణంలో రూపొందించిన ఈ పాట సినిమాకు ఆకర్షణ అవుతుందని చిత్రబృందం చెబుతున్నారు. నవ్య స్వామి, నర్రా శీను, పమ్మి సాయి, వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, మిర్చి కిరణ్, కంచరపాలెం కిషోర్, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 26న  ప్రేక్షకుల ముందుకురానుంది.

సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంభాషణలు: గణేష్ కుమార్ రావూరి, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై,  ప్రొడక్షన్ కంట్రోలర్: సిహెచ్ రామకృష్ణా రెడ్డి, పీఆర్ఓ: లక్ష్మి వేణుగోపాల్, నిర్మాతలు: ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య,దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్.

Social Share Spread Message

Latest News