Skip to main content

Namaste NRI

నేపాల్‌లో ఘోర  ప్రమాదం

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 72 సీట్ల ప్యాసింజర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆదివారం ఉదయం పొఖారా అంతర్జాతీయ విమానశ్రయం, పక్కనే ఉన్న పాత విమానాశ్రయం మధ్య విమానం కూలిపోయింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ ఖాట్మండు నుంచి పొఖారా వెళ్తూ ప్రమాదానికి గురైందని, ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని యెతీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు.  పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పాత విమానాశ్రయం మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది.  ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయని, అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. ఈ ఘటన కారణంగా పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమాన శిధిలాల నుంచి కొన్ని మృత దేహాల‌ను వెలికి తీశారు. ఈ ప్ర‌మాదంలో ఎంత‌మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారో వివ‌రాలు వెల్ల‌డి కాలేదు.  కాగా, ప్రమాదం నేపథ్యంలో నేపాల్‌ క్యాబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది.

Social Share Spread Message

Latest News