Skip to main content

Namaste NRI

విశ్వసుందరిగా అమెరికా అందగత్తె.. కిరీటం దక్కించుకున్న బొన్ని గాబ్రియేల్

మిస్ యూనివర్శ్ 2022 కిరీటాన్ని అమెరికాకు చెందిన బోనీ గ్యాబ్రియెల్ దక్కించుకుంది. అమెరికా లూసియానాలోని న్యూ ఒర్లియాన్స్‌లో జ‌రిగిన ఫైన‌ల్స్ పోటీలో బోనీ గ్యాబ్రియెల్ విజేతగా నిలిచింది. ఇండియాకి చెందిన 2021 విశ్వ సుందరి హర్నాజ్ సంధు ఆమెకు కిరీటాన్ని బహుకరించింది. మిస్‌ యూనివర్స్-2022 పోటీలు అమెరికా కాలమానం ప్రకారం జనవరి 14న రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం జనవరి 15 ఉదయం 6.30 గంటలకు) ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి 84 మంది సుందరాంగులు పోటీ పడ్డారు.  వెనిజులా బ్యూటీ ఆండ్రియా మార్టినెజ్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా,మిస్ డొమినికన్ రిపబ్లిక్ బ్యూటీ ఆండ్రెల్నా మార్టిల్నెజ్ ఫౌనియర్ రొసాడో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీల‌లో మ‌న దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన దివితా రాయ్ క‌నీసం తొలి ప‌ది స్థానాల‌లో కూడా చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. కాగా భారత్‌కు ఇప్పటివరకు మూడు సార్లు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కింది. భారతీయ సుందరాంగులు సుస్మితాసేన్‌ (1994), లారాదత్తా (2000), హర్నాజ్‌ సంధు (2021) విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు.

Social Share Spread Message

Latest News